నీహారిక నిశ్చితార్థానికి పవన్ కల్యాజ్ రాకపోవడానికి కారణమిదేనా..?

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థ వేడుక గురువారం రాత్రి చాలా సింపుల్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే వేడుకకు దాదాపు మెగా ఫ్యామిలీ పెద్దలు హీరోలు అందరూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కుటుంబ పెద్దగా వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

యువ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా అందరూ వేడుకలో సందడి చేయగా ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే పవన్ దీక్షలో ఉండడం వలనే ఫంక్షన్ కి దురమైనట్లు తెలుస్తోంది. సాయత్రం 6దాటిన తరువాత బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ధ్యానంలో ఉంటారట. అందుకే ఆ నియమాల కారణంగా రాలేదనే టాక్ వస్తోంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మెగా కుటుంబ సభ్యులే క్లారిటీ ఇవ్వాలి.