సినిమా థియేటర్ కార్మికులకు రావుల చేయూత..!

కరోనా covid-19 కారణంగా గత నాలుగు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడడం జరిగింది. ఈ కారణంగా సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికుల జీవనోపాధి కష్టంగా మారింది. వారి గురించి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వారికి ఉడత భక్తితో సహాయం అందించారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో ఉన్న సినిమా థియేటర్ లో పని చేసుకునే 36 మంది కార్మికులకు కందిపప్పు, ఉప్పు, గోధుమ పిండి, గోధుమ రవ్వ, టి పొడి, మంచి నూనె, పసుపు,తదితర నిత్యవసర వస్తువులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల చేత పంపించి 36 మంది సినిమా ధియేటర్ కార్మికులకు వారి ద్వారా పంపిణీ చేశారు, ఈ సందర్భంగా రావుల కార్మికులతో నేరుగా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిమల్ల అశోక్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి టి డి పి .గౌస్, నాగర్కర్నూల్ పార్లమెంట్ కార్యదర్శి దస్తగిరి, టిడిపి యువ నాయకులు ఏర్పుల రవి. థియేటర్ మేనేజర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.