RGV చేతిలో ప్రస్తుతం ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

RGV

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ పడిందనే చెప్పాలి. దీంతో చాలా మంది OTT ఫ్లాట్ ఫార్మ్ చాలా బెటర్ అని అటు వైపుగా అడుగులు వేస్తున్నారు. ఇక విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందరి కంటే ముందే తనకంటూ సపరేట్ గా ఒక ట్రాక్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే.

RGV వరల్డ్ క్రియేట్ చేసుకొని సపరేట్ గా యాప్ లోనే సినిమాలను రిలీజ్ చేస్తున్న వర్మ లాభాలు కూడా గట్టిగానే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం అనే సినిమాలు రిలీజ్ చేసిన వర్మ త్వరలో మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రాబోతున్నాడు. పవర్ స్టార్, మర్డర్, థ్రిల్లర్, కరోనా వైరస్, హారర్..అంటూ ఇలా డిఫరెంట్ సినిమాలను రూ.5లక్షల లోపే ఖర్చు చేసి నిర్మిస్తున్నాడు.

మొత్తంగా RGV చేతిలో ప్రస్తుతానికి 9సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో కొన్ని వర్మ డైరెక్ట్ చేస్తే మరికొన్ని ఆయన శిష్యులు డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా వైరస్ దెబ్బకు అందరూ ఖాళీగా ఉంటే వర్మ మాత్రం మునుపెన్నడు లేనంత బిజీగా ఉన్నాడని అర్ధమవుతోంది. మరి ఆ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాడో చూడాలి.