కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్` చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
ఈ చిత్రానికి అశ్వంత్ సంగీతాన్ని అందిచారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ప్రయాణం అనే పాట విడుదలైంది. అద్భుతమైన బాణీకి అందమైన విజువల్స్ తోడైనట్టు కనిపిస్తోంది. రాకేందు మౌళి సాహిత్యం, అభయ్ జోధ్‌పుర్కర్ గానం అద్భుతంగా ఉంది. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది.
సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో, భయంకరమైన ఐస్ఐస్ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనేది ఎఫ్ఐఆర్ మూలకథ. ఈ కథ చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో జరుగుతుంది.
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అశ్వంత్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
నటీనటులు : విష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రేబా మోనికా జాన్, మాల పార్వతి తదితరులు
సాంకేతిక వర్గం:
నిర్మాత – విష్ణు విశాల్
రచన,దర్శకత్వం – మను ఆనంద్
సమర్పణ- రవితేజ
డిఓపి- అరుల్ విన్సెంట్
రిలీజ్- అభిషేక్ పిక్చర్స్
మ్యూజిక్- అశ్వంత్
ఎడిటర్- ప్రసన్న జీకే
స్టంట్స్- స్టన్ శివ
పాటలు – రాకేందు మౌళి
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – అనిత మహేంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – సీతారాం స్రవంతి సాయినాథ్ దినేష్ కర్ణం