మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ `క్రాక్` సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం `క్రాక్‌`. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్ పూర్త‌య్యాయి. ఇది వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌లో ర‌వితేజ మాస్ లుక్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.
ర‌వితేజ ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇన్‌టెన్స్ లుక్‌, చేతిలో గోలీసోడాను ప‌ట్టుకున్న ర‌వితేజ `క్రాక్` సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ర‌వితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిల‌బ‌డి ఉండ‌టాన్ని చూడొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
స‌ర‌స్వ‌తి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. మెర్స‌ల్‌, బిగిల్ చిత్రాల‌ల్లో విజువ‌ల్ బ్యూటీ అందించిన జి.కె.విష్ణు ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, సుమ‌ద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి.మ‌ధు
బ్యాన‌ర్‌: స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె.విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
కో ప్రొడ్యూస‌ర్‌: అమ్మిరాజు కానుమిల్లి
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ఫైట్స్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య‌శాస్త్రి
మేక‌ప్‌: శ్రీనివాస‌రాజు
కాస్ట్యూమ్స్‌: శ‌్వేత‌, నీర‌జ కోన‌
స్టిల్స్‌: సాయి
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన్‌: వ‌ర్కింగ్ టైటిల్ శివ‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కోట‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌
కో డైరెక్ట‌ర్స్‌: గులాబి శ్రీను, నిమ్మ‌గడ్డ శ్రీకాంత్‌
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: పీవీవీ సోమ‌రాజు