సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంబాసిడర్ గా సినీ నటి రష్మిక మందాన

రష్మికను ప్రస్తుతం భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమిం చింది. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎంతగా పెరిగాయో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా యుగంలో ఏది ఫేక్.. ఏది నిజం అన్నది తెలుసుకో వడమే కష్టంగా ఉంది.

వ్యక్తి ప్రైవసీకి స్వేచ్చ లేదు. వ్యక్తిగత సమాచారం అంతా బయటకు వెళ్తోంది. సైబర్ నేరగాళ్ల ఆగడాలు శ్రుతి మించిపోతోన్నాయి. అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం నూతన కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమానికి రష్మికని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

ఈ మేరకు రష్మిక ఓ వీడియోని షేర్ చేసింది. ‘నా డీప్ ఫేక్ వీడియోని బాగా వైరల్ చేశారు. ఆ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. అదొక సైబర్ నేరం. అప్పుడు ఈ సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను.

అందుకే నేను భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. ఆ ఐ4సీ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నాను.

సైబర్ నేరగాళ్లు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో చెప్పలేం.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. అందరూ కలిసి కట్టుగా పోరాడి.. సైబర్ నేర రహిత భారత్‌ను క్రియేట్ చేద్దాం అంటూ రష్మిక చెప్పు కొచ్చింది.

తనకు జరిగింది ఇంకొకరి జరగకుండా సైబర్ నేరాలపై అవగాహన పెంచడానికి ముందుకు వచ్చిన రష్మికను ఈ వార్త చూసిన చాలామంది ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.