హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమైన బాలీవుడ్ హిట్ కాంబో

మాస్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ మరియు రోహిత్ శెట్టి మరోసారి కలవబోతున్నారు. అంగూర్ (1982) సినిమాను సరికొత్తగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు అభిమానులకు ఒక సరికొత్త గుడ్ న్యూస్ చెప్పారు. టెంపర్ రీమేక్ సింబాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ కాంబోపై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి.

ఇక విస్తృత సమీక్షలను అందుకున్న తరువాత అభిమానుల్లో కూడా అంచనాల డోస్ పెరిగింది. అక్షయ్ కుమార్ సూర్యవంశి కోసం ఇటీవల రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి మరోసారి ఒకటవ్వడంతో అభిమానులు సంతోషించారు. ఈజ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఆ సినిమా విడుదల కాకముందే రణ్‌వీర్ మరియు రోహిత్ మరో మాస్ ఎంటర్టైన్మెంట్ కథతో సిద్ధమవుతున్నట్లు చెప్పారు. 1982లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ అంగూర్ ని మళ్ళీ కొత్తగా తెరకెక్కించాలని రోహిత్ శెట్టి డిసైడ్ అయ్యాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి