అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ కాదట..

టెక్నలిజి ఎంత డెవలప్ అయినా కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు ఆశ్చర్యనికి గురి చేస్తాయి. స్టార్స్ పుట్టినరోజలు అలాగే వారి వ్యక్తిగత విషయాలలో గూగుల్ కూడా తప్పటడుగులు వేస్తోంది. ఇక ఇటీవల ఒక క్రికెటర్ భార్య పేరు కొడితే మరొకరి భార్య పేరును చూపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆ పొరపాటు విరాట్ కోహ్లీ భార్య విషయంలోనే చోటు చేసుకోవడం మరో షాకింగ్ న్యూస్.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. అఫ్గనిస్తాన్‌ క్రికెటర్ రషీద్ ఖాన్ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ఇక ఐపీఎల్ ద్వారా ఈ కుర్రాడు ఇండియాలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని గట్టిగానే పెంచుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో అనుష్క సినిమాలంటే చాలా ఇష్టమని, ఆమె తనకు ఇష్టమైన కథానాయిక అని చెప్పాడు. అప్పుడు గూగుల్ అదే ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. ఆ తరువాత ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు గాని రషీద్ ఖాన్ భార్య ఎవరని సెర్చ్ చేస్తే విరాట్ సతీమణి అనుష్క శర్మ పేరును చూపిస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ పొరపాటును గూగుల్ ఎప్పుడు సరిచేస్తుందో చూడాలి.