రానా పెళ్లికి అతిధులు ఎంతమంది అంటే?

rana

కరోనా వైరస్ కారణంగా శుభకార్యాలు కూడా ధైర్యంగా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఘనంగా నిర్వహించుకోవాలని అనుకున్న వారు కూడా సింపుల్ గా కానిచ్చేస్తున్నారు. నిఖీల్, నితిన్ లాంటి హీరోలు ఏంత సింపుల్ గా పెళ్లి వేడుకలను పూర్తి చేసుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రానా దగ్గుబాటి కూడా అదే తరహాలో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని రోజుల్లో రానా, మిహికాల పెళ్లి రామానాయుడు స్టూడియోలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక వేడుకకు కేవలం 30మంది అతిధులు మాత్రమే హాజరు కాబోతున్నారు. పెళ్లి వేడుకను ముందుగా ఫలక్ నుమా ప్యాలెస్ లో నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సురేష్ బాబు లొకేషన్ చేంజ్ చేశారు. ఇక పెళ్లికి పాల్గొనబోయే వారికి ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.