భళ్లాలదేవ రానా హీరోగా, ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరణ్య. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ సినిమాను మార్చి 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ వేదికగా వెల్లడించగా.. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. మా చిత్ర విడుదల తేదీని ప్రకటించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. త్వరగా ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించాలని నేను వేచి చూస్తున్నా అని ట్వీట్ చేశారు రానా. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్లావోంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుండగా.. శంతన్ మొయిత్రా ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా 2020 ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.