ఉప్పెన టీజ‌ర్‌పై రాంచ‌రణ్ ‌ప్ర‌శంస‌లు..

మెగా కాంపౌండ్ నుంచి మెగా అల్లుడు సాయితేజ్ త‌మ్ముడు హీరోగా తెరంగ్రేటం చేస్తున్న సినిమా ఉప్పెన‌. ఈ సినిమా టీజ‌ర్ సంక్రాంతి కానుక‌గా.. విడుద‌ల అయ్యి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఈ టీజ‌ర్‌ను చూసి మూవీ టీంకు విషేస్ తెలియ‌జేశాడు. టీజ‌ర్ చాలా బాగుంద‌ని.. బ్ర‌ద‌ర్ పంజా వైష్ణ‌వ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిల జంట బాగుంది. ఇద్ద‌రి జంట చాలా ఫ్రెష్‌గా అనిపించింది.

ramacharan uppena

ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు, మైత్రి మూవీ మేక‌ర్స్‌కు, ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కు శుభాకాంక్ష‌లు.. ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకోగా.. దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.