టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తుచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేసిన రకుల్.. అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో క్రిష్ సినిమాతో పాటు నితిక్కి జోడీగా చెక్ సినిమాలో చేస్తోుంది. ఇక హిందీలో కూడా మూడు ప్రాజెక్టులకు సైన్ చేసింది. ఇలా బిజీ షెడ్యూల్స్‌తో బిజీబిజీగా గడుపుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.
ఇక రకుల్ ఫలానా హీరోతో లవ్‌లో ఉందంటూ మీడియాలో చాలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్లో ఒక యంగ్ హీరోతో రకుల్ ప్రేమాయణం నడుపుతుందని గత కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజగా రకుల్ స్పందించింది. ప్రస్తుతం లవ్ చేసేంత తీరిక లేదని, ప్రస్తుతం అలాంటి ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని, రెండేళ్ల తర్వాత పెళ్లిచేసుకుంటానని రకుల్ చెప్పింది.అంతవరకు వర్క్‌పైనే ఫెకస్ పెడతానని, రకుల్ తెలిపింది.