స్పైడర్ మ్యాన్ అభిమానులకు శుభవార్త

స్పైడర్ మ్యాన్ సినిమాను ఇష్టపడని వారు ఉండరు. ప్రతిఒక్కరూ ఈ సినిమాను చూసే ఉంటారు. ఇక చిన్నపిల్లలైతే ఈ సినిమాలను మరింతగా ఇష్టపడతారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఎవరినైనా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ 2 సినిమాలు రాగా.. త్వరలో స్పైడర్ మ్యాన్ 3 సినిమా కూడా తెరకెక్కనుంది. స్పైడర్ మ్యాన్ 1, స్పైడర్ మ్యాన్ 2లో వేర్వేరు నటుడు నటించగా.. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 3లో స్పైడర్ మ్యాన్ 1, స్పైడర్ మ్యాన్ 2 నటులు కనిపించనున్నారు.

spiderman 3

ఆండ్రూ గార్ఫీల్డ్, కిర్‌స్టన్ డన్స్ట్, ఎమ్మా స్టోన్ స్పైడర్ మ్యాన్ 3 లో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది 17 డిసెంబర్ 2021 న థియేటర్లలో విడుదల కానుంది.స్పైడర్ మ్యాన్ పాత్రలో ఇప్పటివరకు 3 వేర్వేరు నటులు కనిపించగా.. ప్రతి ఒక్కరూ ప్రేక్షకులను మైమరిపించారు. అందరూ పాత స్పైడర్ మాన్‌ని మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పాత నటులే స్పైడర్ మ్యాన్ 3లో కనిపించనుండటంతో.. అందరి కోరిక నెరవేరినట్లుంది.

పాత ‘స్పైడర్ మ్యాన్’ సినిమాల్లో నటించిన పీటర్ పార్కర్ ఆండ్రూ గార్ఫీల్డ్, టోబి మాగ్వైర్ ఈ సినిమాల్లో కనిపించున్నారు. ఇక పాత స్పైడర్ మ్యాన్ సినిమాల్లో డాక్టర్ అక్టోపస్‌గా నటించిన ఆల్ఫ్రెడ్ మోలినా ఈ సినిమాలో కూడా నటించనున్నారు. జాన్ వాట్టస్ స్పైడర్ మ్యాన్ 3ని తెరకెక్కించనుండగా.. కెవిన్ ఫీజ్, అమీ పాస్కల్ నిర్మించనున్నారు.