డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సోదరుడు అరెస్ట్

రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఈరోజు అరెస్టు అయ్యాడు. పక్క సమాచారంతో తనిఖీలు వ్యవహరించిన పోలీసులకు 200 గ్రాముల కొకైన్ తో అతడు పట్టుబడ్డాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఐదుగురు నైజీరియాలతో పాటు మరో ఐదుగురు పట్టు పడగా వారిలో అమన్ ప్రీత్ సింగ్ ఒకరు. అయితే దొరికిన కొకైన్ విలువ సుమారు రెండు కోట్లు ఉండొచ్చని పోలీసులు అంచనా. రాజేంద్రనగర్ లోని నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులకు మొదటి పట్టు పడగా అరెస్టు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పై ఎన్నో డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన తదుపరి వివరాలు సైబరాబాద్ పోలీసులు చెప్పవలసి ఉంది.