నా ప‌ని అయిపోయింద‌న్నారు.. ఆ సినిమాతో స‌మాధానం ఇచ్చా: ర‌కుల్‌

ఫిట్‌నెస్ భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ ద‌క్షిణాదిలో అగ్ర క‌థానాయిక‌గా గుర్తింపు సంపాదించుకుని.. బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా సత్తా చూపెడుతూనే ఉంది. ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే టాప్ హీరోలంద‌రితోనూ ర‌కుల్ ఆడిపాడింది. కాగా ర‌కుల్ ఫిట్‌నెస్ విష‌యంలో చాలా స్ట్రిక్‌గా ఉంటార‌ని అంద‌రికీ తెలుసు. అలాగే త‌న‌కు క‌థ న‌చ్చితే.. కొత్త లుక్ కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తానంటాది ర‌కుల్‌.. తాజాగా ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఆసక్తిక‌ర విష‌యం వెల్ల‌డించింది.

rakulpreeth singh

బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్‌దేలో త‌న పాత్ర కోసం అతి త‌క్కువ స‌మ‌యంలోనే దాదాపు 8కిలోలు బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా మారాన‌ని తెలిపింది. ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌న్‌, ట‌బులాంటి పెద్ద స్టార్స్‌తో క‌లిసి ప‌నిచేసే ఛాన్స్ వ‌దులుకోకూడ‌ద‌న్న ల‌క్ష్యంతో బాగా క‌ష్ట‌ప‌డ్డా.. రోజూ జిమ్‌లో 5గంట‌లు క‌ష్ట‌ప‌డి.. కేవ‌లం 40రోజుల్లోనే 8కిలోలు త‌గ్గాను. అప్పుడు నా లుక్స్‌పై సోష‌ల్ మీడియాలో చాలా ట్రోల్స్ వ‌చ్చాయి. చాలా మంది నా ఫోటోలు షేర్ చేస్తూ.. ఏంటీ ఇంత స‌న్న‌గా మారిపోయావు?.. ఇక నీ సినిమాలెవరూ చూడ‌రు అంటూ నీ ప‌ని అయిపోయింది.. టాలీవుడ్‌లో అవ‌కాశాలు రావు అని కామెంట్స్ చేశారు. అప్పుడు నేను అనుకున్నది ఒక్క‌టే.. క‌ళ్లు మూసుకుని మ‌న‌స్సులో ఏదీ పట్టించుకోకు.. నీ క‌ష్ట‌మే ఆ విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెబుతుంది.. అని స‌ముదాయించుకున్నాను. ఆ చిత్రం హిట్‌గానే కాకుండా త‌న‌కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింద‌ని ర‌కుల్ తెలిపింది. ర‌కుల్ ప్ర‌స్తుతం నితిన్ హీరోగా చెక్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం త్వ‌ర‌లో థియేట‌ర్లోకి రానుంది. అలాగే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో పంజా వైష్ణ‌వ్ తేజ్ జంట‌గా ర‌కుల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక బాలీవుడ్‌లో మేడే అనే చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది ర‌కుల్‌.