‘రక్షణ’ సినిమా జెన్యూన్ రివ్యూ

పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్ లో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘రక్షణ’. ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ దర్శక నిర్మాతగా మన ముందుకు వచ్చిన సినిమా కు అనిల్ బండారి కొరియోగ్రాఫేర్ గా పని చేసారు. ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందించగా గారి ఎడిటింగ్ చేసారు. ఇక ఈ చిత్ర ఎలా ఉంది అనే విషయానికి వస్తే….

కథ :
పాయల్ రాజ్పుత్ పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చింది. పోలీస్ ఆఫీసర్ గా పాయల్ ఎటువంటి ఛాలెంజ్ లు ఎదుర్కొంది, ఎటువంటి నేరస్థులను ఎదుర్కొంది అనేది సినిమా లో చూడాల్సిందే. పాయల్ ఎదుర్కొన్న ఓ సైకో కిల్లర్ ఎవరు? ఆ కిల్లర్ ఎందుకు కొంత మందిని టార్గెట్ చేసి చంపుతున్నాడు? ఆలా చంపినా సైకో కిల్లర్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఆ సైకో కిల్లర్ ని పాయల్ పట్టుకుందా? పోలీసు వ్యవస్థ పాయల్ కు సహకరించింది లేదా తన సొంత పోలీసు వ్యవస్థ పాయల్ మాటలు కొట్టిపడేసింద? అనే ఎన్నో మలుపులతో ఈ సినిమా ఉండబోతుంది.

నటన :
పాయల్ విషయానికి వస్తే పోలీసు ఆఫీసర్ పాత్రలో పాయల్ చాలా బాగా నటించారు. అలాగే బిగ్ బాస్ మానస్ ఓ కీలక పాత్ర పోషించారు. సినిమాలో కనిపించే ప్రతి ఒక్కరు తమ పూర్తి స్థాయి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రాజీవ్ కనకాల, ఆనంద చక్రాపని సినిమాలో మనకి తక్కువ సమయమే కనిపించినప్పటికీ చాలా బాగా పెర్ఫర్మ్ చేసారు. దర్శకుడు నటీనటులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో దర్శకుడు ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ను మెచ్చుకోవలసిందే.

సాంకేతిక విశ్లేషణ:
సాంకేతిక విషయాలకు వస్తే ముందుగా దర్శకత్వం గురించి చెప్పుకోవాలి. కథకు తగ్గట్లు మంచి టెక్నికల్ విలువలతో దర్శకుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదట స్క్రీన్ప్లే కాస్త నిదానంగా ఉంది అనిపించినప్పటికీ, మొదట కథ అర్ధం కావడం కోసం స్క్రీన్ప్లే స్లో గా ఉండటమే మంచిది అనిపించేలా ఉంది. దుబ్బింగ్ లో కొంచం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నిపించింది. మొదట బ్యాక్ గ్రౌండ్ కొంచం నిదానంగా ఉంది అనిపించి కానీ క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు అని చెప్పుకోవాలి.

పాజిటివ్:
కథ, నటీనటుల పెర్ఫార్మన్స్, టెక్నికల్ విలువలు

నెగటివ్:
స్క్రీన్ప్లే కొంచం నెమ్మదిగా ఉంది అనిపిస్తుంది, దుబ్బిను

ఒక్క మాటలో చెప్పాలి అంటే సమాజంలో జరిగే కొన్ని అసంగిక చర్యలను బేస్ గా తీసుకుని నేటి ఆడవాళ్లు ఎలా ఇబ్బందులు పడుతున్నారో చూపించారు ఈ సినిమాలో. కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా ఇది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా పూర్తిగా ఓ మెసేజ్ ఉన్న సినిమా. అటు వినోదంతో పాటు ఇటు బాధ్యతలు కూడా నేర్పించేలా ఉంటుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లు ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవచ్చు.