Biggboss-14: బాలీవుడ్ శృంగార తార రాఖీసావంత్ 2006లో తొలి బిగ్‌బాస్ సీజన్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత 14ఏళ్ల తర్వాత మళ్లీ బిగ్‌బాస్-14సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చింది రాఖీ. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో తన జీవితంలో భాగమైంది. అయితే రితీష్ అనే ఎన్నైరైను రాఖీ వివాహమాడిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్-14 షోలో భాగంగా చివరి కోరిక టాస్క్‌లో రితీష్ పంపిన లేఖను చింపి వేసే అవకాశాన్ని Biggboss-14బిగ్‌బాస్ రాఖీసావంత్‌కు ఇచ్చారు. దీంతో ఆ లేఖను చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అలాగే అతనితో తమ వైవాహిక బంధానికి కూడా ఫుల్స్టాప్ పెడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. రితీష్‌తో తన వివాహం ఒక స్కాం వంటిదని ఆమె అన్నారు.
తనన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది.. Biggboss-14బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన వెంటనే అతనితో పెళ్లి బంధాన్ని తెంచుకుంటానని తెలిపింది. భార్యలు పొందే ఏ ఒక్కటి రితేష్ తనకు ఇవ్వలేదని చెప్పింది. ఆభరణాలను పొందడం ద్వారా మాత్రమే ఒక భార్య హక్కులు పూర్తి కావని వివరించింది. అయితే అంతకుముందు రాఖీ తన భర్త రితేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు అప్పటికే పెళ్లయిందని, భార్య, ఒక బిడ్డ ఉన్నారనే విషయాన్ని తనకు చెప్పాడని రాఖీ తెలిపింది. అందుకే రాఖీ సావంత్ తన భర్తతో బంధాన్ని తెంచుకోవాలని అనుకున్నాదట.. తన కోసం ఒక మహిళ, ఒక బిడ్డ జీవితాలను నాశనం చేయలేనని తెలిపింది రాఖీసావంత్.