లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనల్ హిటాసో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు రాజు గారి దొంగలు సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు జెమినీ సురేష్ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ వచ్చి నన్ను ఈ ఈవెంట్ కు పిలిచాడు. నేను బిజీగా ఉన్నా, వైజాగ్ వాళ్లు అని చెప్పగానే వస్తానని అన్నాను. వైజాగ్ అంటే నాకు ఒక ఎమోషన్. రాజు గారి దొంగలు టీజర్ బాగుంది. టైటిల్స్, తన పేరులోనే క్రియేటివిటీ చూపించారు డైరెక్టర్ లోకేష్. సినిమాను కూడా ఇలాగే కొత్తగా తెరకెక్కించాడని అనుకుంటున్నాను. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – సినిమా అంటే మనందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది. నేనూ మీలాగే సినిమా షూటింగ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చాను. ప్రొడ్యూసర్ గా ఎదిగాను. కష్టపడితే మీరు కూడా మంచి పొజిషన్ కు వెళ్లొచ్చు. రాజు గారి దొంగలు పోస్టర్, సాంగ్, టీజర్ బాగుంది. ఆర్టిస్టులంతా బాగా పర్ ఫార్మ్ చేశారు. దొంగ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాల్లో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది, ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలి. డైరెక్టర్ లోకేష్, ప్రొడ్యూసర్ బంగారునాయుడు మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – మనం ఇతర భాషల సినిమాలు చూసి అరే భలే చేశారే మూవీ అనుకుంటాం. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం రాజు గారి దొంగలు సినిమాతో డైరెక్టర్ లోకేష్ రనల్ హిటాసో చేశారు. టీజర్ లోనే ఆ కొత్తదనం కనిపించింది. కొడుకుని నమ్మిన తండ్రి సినిమాను ప్రొడ్యూస్ చేస్తే, ఫ్రెండ్స్ నటించారు. ఇలాంటి అనుబంధం ఉన్న మీకోసం రేపు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వస్తారు అన్నారు.
యాక్టర్ లోహిత్ కల్యాణ్ మాట్లాడుతూ – ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన దామోదర ప్రసాద్ గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి, జెమినీ సురేష్ గారికి థ్యాంక్స్. రాజు గారి దొంగలు సినిమాలో నేను నటించే అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ లోకేష్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే అంకుల్ బంగారునాయుడు లేకుంటే ఈ మూవీ ఉండేది కాదు. రాజు గారి దొంగలు టీజర్ , సాంగ్, పోస్టర్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాం. సినిమా కూడా చాలా బాగుంటుంది. త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం అన్నారు.
యాక్టర్ రాజేష్ కుంచాడా మాట్లాడుతూ – రాజు గారి దొంగలు టీజర్ బాగుందని మీరంతా చెప్పడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్, డైరెక్టర్ లోకేష్ కు థ్యాంక్స్. ఒక కొత్త ప్రయత్నం మేమంతా కలిసి చేశాం. మా చిన్న చిత్రానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు.
డైరెక్టర్ లోహిత్ రనల్ హిటాసో మాట్లాడుతూ – మా రాజు గారి దొంగలు టీజర్ లాంఛ్ కు వచ్చిన దామోదర ప్రసాద్ గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి, జెమినీ సురేష్ గారికి థ్యాంక్స్. నేను డైరెక్టర్ కావాలని కలగన్నాను. మరో ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్తే సినిమా అవకాశం ఇచ్చేందుకు ఎంత టైమ్ పడుతుందో తెలియదు. నా డ్రీమ్ ను, నన్ను నమ్మి మా నాన్న ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలాగే నా ఫ్రెండ్స్ అంతా ఈ మూవీలో నటించారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. త్వరలోనే మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాం అన్నారు.
నిర్మాత నడిమింటి బంగారునాయుడు మాట్లాడుతూ – రాజు గారి దొంగలు సినిమాతో మా అబ్బాయి లోకేష్ డైరెక్టర్ గా మారుతుండటం సంతోషంగా ఉంది. ఒక మంచి కథతో ఈ మూవీ చేశాడు. టీజర్ ఎంత బాగుందో సినిమా కూడా అలాగే మీ అందరి ఆదరణ పొందుతుంది. త్వరలోనే మా రాజు గారి దొంగలు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.
యాక్టర్ జోషిత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ – రాజు గారి దొంగలు సినిమా టీజర్ మీ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఈ చిత్రంతో నటుడిగా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
నటి పూజా విశ్వేశ్వర్ మాట్లాడుతూ – సలార్ చిత్రంతో మీ అందరి ఆదరణ పొందడం ఎంతో హ్యాపీగా ఉంది. డైరెక్టర్ లోకేష్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు తప్పకుండా నటించాలని అనుకున్నాను. వేరే ప్రాజెక్ట్స్ వదులుకుని మరీ ఈ మూవీలో నటించాను. మా టీమ్ అంతా హ్యాపీగా షూటింగ్ చేశాం. రాజు గారి దొంగలు సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
యాక్టర్ కైలాష్ మాట్లాడుతూ – రాజు గారి దొంగలు సినిమాలో నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. షూటింగ్ టైమ్ లో మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ లా మారిపోయాం. ఈ సినిమా యూనిట్ నాకు మరో ఫ్యామిలీ అనిపించింది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లోకేష్, ప్రొడ్యూసర్ బంగారునాయుడు గారికి థ్యాంక్స్ అన్నారు.
నటీనటులు – లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు తదితరులు.
టెక్నికల్ టీమ్ :
డిఓపి- సందీప్ బదుల, ప్రకాష్ రెడ్డి
స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి, సూరాడ బ్రహ్మ విజయ్
మ్యూజిక్ – నాఫల్ రాజా ఏఐఎస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజవంశీ
పీఆర్ఓ – చందు రమేష్
బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ
సమర్పణ – నడిమింటి లిఖిత
నిర్మాత – నడిమింటి బంగారునాయుడు
దర్శకత్వం – లోకేష్ రనల్ హిటాసో