రజనీకాంత్ జైలర్ సినిమా విలన్ అరెస్ట్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే అదే సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్ నటన పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈరోజు హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్టు చేయడం జరిగింది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ సిబ్బందితో మద్యం సేవించిన మత్తులో దురుసుగా ప్రవర్తించడం వల్ల వారు వినాయకన్ ను అరెస్టు చేసి ఏర్పోర్ట్ పోలీస్ సిబ్బందికి అప్పగించడం జరిగింది. గతంలో కూడా వినాయకన్ పలువుడితో ఇలాగే దుడుసుగా ప్రవర్తించడం, దాడులకు పాల్పడడం జరిగింది.