రజనీ షూటింగ్ ఆగిపోయినట్లే

త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటనతో అభిమానులు ఆనందంలో ముగినిపోయారు. రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఎప్పటినుంచో అభిమానులు ఒత్తిడి పెడుతున్నారు. ఇప్పడు ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు రజనీ చేసిన ప్రకటనపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31న రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన రజనీ.. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు చెప్పారు.

RAJANIKANTH

మరికొద్ది నెలల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే రజనీ రాజకీయాల్లోకి అడుగుపెడుతుండటంతో.. ఆయన ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తే సినిమా షూటింగ్ జరుగుతుందా?.. లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయింది. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయే అవకాశముంది.

తమిళనాడు ఎన్నికల తర్వాతే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక రజనీకాంత్ సీఎం అయితే ఈ షూటింగ్ జరుగుతుందా?.. లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో రజనీకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా విడుదల కానుంది.