షాకింగ్: ఆ పార్టీకి రజనీ మద్దతు?

రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆయన ప్రకటనపై కొంతమంది అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రజనీ ఇంటి ముందు ఆందోళనలు చేశారు. కానీ అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి అడుగుపెట్టకూడదని రజనీ తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేయగా.. మరికొంతమంది మాత్రం వ్యతిరేకించారు.

rajanikanth supoort kamal parry

రజనీ మంచి నిర్ణయం తీసుకున్నారని లోకనాయకుడు కమల్‌హాసన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం అభిమానులకు చాలా ముఖ్యమని చెప్పారు. త్వరలోనే రజనీకి కలుస్తానన్నారు. ఈ క్రమంలో కమల్ కీలక ప్రకటన చేశాడు. తన పార్టీకి మద్దతివ్వాలని సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కోరుతానని కమల్ వెల్లడించారు. తన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రజనీని కలుస్తానన్నారు.