సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న అల్లుఅర్జున్‌!

టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ చిత్రాల‌తో స్టైలిష్‌స్టార్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్‌. తెలుగులోనే కాదు మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా త‌న‌దైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఒక ప‌క్క యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రిని మెప్పించేస్టార్‌గా ఎదిగిన‌ బ‌న్నీ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో 10మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అల్లుఅర్జున్ అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్‌మీడియాలో బ‌న్నీకి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. అదేవిధంగా ట్విట్ట‌ర్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ బ‌న్నీకి ఫాలోవ‌ర్స్ సంఖ్య మిలియ‌న్లలోనే ఉంది. గ‌తేడాది త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల వైకుంఠ‌పురం చిత్రంతో బ‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.

allu arjun record

ప్ర‌స్తుతం అల్లుఅర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తుండ‌గా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ క‌థాంశంతో చిత్తూరు నేప‌థ్యంలో న‌డిచే ఇతివృత్త‌మిద‌ని.. అల్లుఅర్జున్ పాత్ర చిత్ర‌ణ న‌వ్య‌రీతిలో సాగుతుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఇటీవ‌లే వ‌చ్చిన ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌లో బ‌న్నీ మాస్ లుక్‌లో క‌నిపించ‌గా.. అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోండ‌గా… దేవీశ్రీ‌ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు.