రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. అభిమానుల్లో టెన్షన్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఇవాళ చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. హైబీపీ కారణంగా రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరారని, ఆయనకు చికిత్స అందిస్తున్నామని తెలిపింది. బీపీని అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నామని, ఈ సమస్య తప్పి ఆయన ఇతర ఇబ్బందులు ఏమీ లేవంది.

rajanikanth

బీపీ అదుపులోకి రాగానే రజనీకాంత్‌ను డిశ్చార్జి చేస్తామని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. రజనీకాంత్‌కు ఈ నెల 22న కరోనా టెస్టు చేయగా.. నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం రజనీకి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, అయినా ఆయన కొన్ని రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారంది.

కాగా ప్రస్తుతం రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా చేస్తుండగా.. దీని షూటింగ్ కోసం గత 10 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా ఈ షూటింగ్ యూనిట్ సభ్యుల్లో ఏడుగురికి కరోనా వచ్చింది. దీంతో సినియా షూటింగ్ అర్ధాంతరంగా ఆపివేశారు. ఈ మూవీకి సిరుత్తై సివ దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.