Rajanikanth: ఇళ‌య‌రాజా మ్యూజిక్ స్టూడియోను సంద‌ర్శించిన త‌లైవా!

Rajanikanth: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా త‌న సొంత మ్యూజిక్ స్టూడియోను ఇటీవ‌లే నిర్మించారు. తాజాగా ఈ స్టూడియోను త‌లైవా ర‌జ‌నీకాంత్ సంద‌ర్శించి.. ఎంతో బాగుంద‌ని కితాబిచ్చారు. త‌మిళ‌నాడులోని ప్ర‌సాద్ స్టూడియోలో తన మ్యూజిక్ ఆఫీస్ విష‌యంలో వివాదం నెల‌కొన్న పరిస్థితులు సంగ‌తి తెలిసిందే. దీంతో ఇళ‌య‌రాజా త‌న సొంత మ్యూజిక్ స్టూడియోను నిర్మించారు. ఇటీవ‌లే ఈ స్టూడియో ప్రారంభ‌మైంది.

Ilayaraja office

ఈ నేప‌థ్యంలోనే Rajanikanthసూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇళ‌య‌రాజా మ్యూజిక్ స్టూడియోను సంద‌ర్శించారు. ఈ స్టూడియో చెన్నైలోని కొడంబాక్కంలో ఉంది. ఈ సంద‌ర్భంగా ర‌జనీకాంత్ మాట్లాడుతూ.. ఇళ‌య‌రాజా గారి మ్యూజిక్ స్టూడియోను చూస్తుంటే ఒక దేవాల‌యం ఉన్న‌ట్లు భావ‌న క‌లిగిందని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇకRajanikanth ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్తె చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో ర‌జ‌నీ స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా చేస్తుంది. అయితే ర‌జ‌నీ ఇటీవ‌లే అనారోగ్య‌బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ‌దీంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. ఇక ఈ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభించాల‌ని చిత్ర‌బృందం భావిస్తుంది.