కీరవాణి కి రాజమౌళి పెద్ద పనే పెట్టాడు

రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రదారులుగా… సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘RRR’. అలాంటి చారిత్రిక నేపథ్యం కలిగి ఉన్న ఈ సినిమాకు సంబందించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగు చూసింది. అదేంటంటే… స్టార్ సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఏకంగా ఎనిమిది పాటలు ఉంటాయని చిత్రవర్గాలు ప్రకటించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి షూటింగ్ ని పూర్తి చేసుకొని… జూలైలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధిన ఈ ఆసక్తికర విషయం ఇప్పుడు T టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో దేశభక్తిని పెంచే పేట్రియాటిక్ సాంగ్స్ తో పాటు హీరో హీరోయిన్స్ మధ్య నడిచే రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన పదాలు, పాటగా రూపాంతరం చెంది యావత్ ప్రేక్షకుల్లో స్వాతంత్య్రకాంక్షని పెంచే విధంగా ఉన్నాయని సమాచారం. బాహుబలి లాంటి విజయవంతమైన సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావటంతో… అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే  ఉన్నాయి.