గడ్డం పెంచు హిట్ కొట్టు, చరణ్ బాటలో స్టైలిష్ స్టార్

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముచ్చటగా మూడోసారి ఓ చిత్రం లో నటించనున్న విషయం తెల్సిందే . తాజాగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి కొంతసమయం ఉన్నాడట. దానికి కారణం అల్లు అర్జున్ తన స్టైల్ ను , మేకోవర్ చేంజ్ చేసుకోవడమేనట.

దర్శకుడు సుకుమార్ గత కొద్దికాలంగా తన చిత్రాల్లో హీరోలకు చాల వైవిధ్యంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన నాన్నకు ప్రేమ తో చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఫుల్ బీయార్డ్ లో  తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపే కలెక్షన్స్ రాబట్టిన చిత్రం రంగస్థలం . ఆ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఫుల్ బీయార్డ్ లో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్ లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. 1980 విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు తాజాగా సుకుమార్ ముచ్చటగా మూడోసారి  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో  ఈ ఫార్ములాను వాడబోతున్నట్లు సమాచారం. ఇంతక ముందు బన్నీ ఫుల్ బీయార్డ్ లో నటించలేదు. తాజాగా ఈ చిత్రంతో అల్లు అర్జున్ తొలిసారిగా ఫుల్ బీయార్డ్ లో నటించబోతున్నారు . ఫుల్ బీయార్డ్ తో బన్నీ వస్తున్నాడని తెలిసి అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న అల వైకుంఠపురంలో నటిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ మరియు  గీత ఆర్ట్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ , అల్లు అరవింద్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.