సూపర్ సార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో #SSMB29 చిత్రం రానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో అనే ఎదురుచూపులు అటు అభిమానులనే కాదు, రాజమౌళి చిత్రం కావడంతో యావత్ ప్రపంచం దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఇప్పటికే మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేనట్లు గడ్డంతో ఒక కొత్త లుక్ తో ఉన్న ఫోటోలు అంతట వైరల్ అవుతున్నాయి. అలాగే ఇటీవల కాలంలో దర్శకుడు రాజమౌళి ఈ సినిమా షూటింగ్ నిమిత్తం లొకేషన్స్ కోసం రెక్కీ కి వెళ్తున్నట్లు కొన్ని ఫోటోలు నెట్ ఇంట వైరల్ గా మారాయి. అయితే రేపు హైదరాబాదులోని రాజమౌళి ఆఫీసులో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలుకానున్నట్లు సమాచారం. రాజమౌళి ఆఫీసులో తమ యూనిట్ సభ్యుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తుంది. అలాగే జనవరి చివరి వారం నుండి సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.