Rajamouli And Ajaydevgn: బాలీవుడ్ స్టార్ హీరోకు జక్కన్న సలహాలు

Rajamouli And Ajaydevgn: టాలీవుడ్‌లో సక్సెస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటేనే.. ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నారంటే.. అది హిట్ అవుతుందని ప్రేక్షకులు పక్కాగా చెబుతారు. ప్రస్తుతం ఎన్టీఆర్-రాంచరణ్ కాంబినేషన్‌లో RRR సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. నిన్ననే ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ మొదలైంది.

rajamouli suggestions to ajaydevagn

అయితే RRRలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్(Ajaydevgn) కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా అజయ్ దేవగణ్ మేడే పేరుతో తెరకెక్కుతున్న సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్షన్‌, సినిమా సెట్టింగ్‌కి సంబంధించి రాజమౌళి(Rajamouli) నుంచి అజయ్ దేవగణ్ సలహాలు తీసుకుంటున్నాడట.