“రాజావారు రాణిగారు” మీ ముందుకొచ్చారు

raja varu rani garu poster

ఈ మధ్యకాలం లో సోషల్ మీడియా లో వినూత్న రీతిలో ట్రెండ్ అయిన పదం #RVRG . అసలు ఈ #RVRG అంటే ఏమిట్రా బాబూ అంటూ తెగ ఆలోచించేసిన యూత్ సస్పెన్స్ కి తెర దించుతూ ఈ మధ్యనే ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ #RVRG అంటే “రాజావారు రాణిగారు” అంటూ టైటిల్ పోస్టర్ ను అలాగే ఒక మోషన్ వీడియో ను రిలీజ్ చేశారు.ఈ టైటిల్ , మోషన్ వీడియో లో ఉన్న నేపథ్య సంగీతం ఇప్పటికే జనాన్ని తెగ ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది.
.
“రాజావారు రాణిగారు” అనే టైటిల్ తో యూనిఫామ్ లో ముచ్చట గా ఉన్న హీరో హీరోయిన్లతో ఈ ఫస్ట్ లుక్ సహజత్వానికి చాలా దగ్గరలో ఉంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదేదో కొంచెం మన స్కూల్,కాలేజ్ డేస్ లను గుర్తు చేసేలా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రం ద్వారా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్నారు.
యువ నిర్మాత మనోవికాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా , జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు.

Cast : Kiran Abbavaram, Rahasya Gorak, Rajkumar Kasireddy, Yazurved Gurram, Snehamadhuri Sharma, Divya Narni
Written and Directed by : Ravi Kiran Kola
Production house : SL Entertainments
Producer : Manovikas D
Music : Jay Krish
Cinematography : Vidyasagar Chinta, Amardeep Guttula
Editing : Viplav Nyshadam
Sound Design : Sync Cinema
Sound Mixing : Aravind Menon
DI : Suresh Ravi
Lyrics : Sanapati Bharadwaj Patrudu, Rakendu Mouli
Direction Team : Prem Kishore – Pradeep Varada – Bharat Rongali – Mahhadh – Shyam – Venkat P.Shetty
Production team : Nanda Lokasani – Marripalem Vinesh Sai Santosh – Challapalli Vishal – Satish Varaputra – Mohan – M. Krupa Roy
Publicity Designs : Dhani Aelay
Digital Media : Sai Prakash – Vineeth Babu