యువ హీరో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్ ని ఉప్పల్ పోలీసులు అడ్డుకున్నారు. అంతే కాకుండా ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు కూడా నమోదు చేయడంతో టాలీవుడ్ లో ఈ న్యూస్ వైరల్ గా మాటింది. కరోనా సంక్షోభంలో ఆగిపోయిన సినిమా షూటింగ్ లు మళ్ళీ మొదలైన విషయం తెలిసిందే. అలాగే వనమాలి ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ ఇటీవల షూటింగ్ కోసం ఉప్పల్ వెళ్ళాడు.
ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో షూటింగ్ చేస్తుండగా సమాచారం అందుకున్న స్థానికి పోలీసులు వెంటనే షూటింగ్ ఆపేశారు. కరోనా సమయంలో అనుమతులు తీసుకోకుండా షూటింగ్ నిర్వహించడం చట్టవ్యతిరేకమైన చర్య అని పోలీసులు సినిమా ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాను ఆహా యాప్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను స్టార్ట్ చేయగా సడన్ గా ఆ సినిమా ఆగిపోయింది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.