RaiLaxmi: అర్థరాత్రి షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ రాయ్‌ల‌క్ష్మీ.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు!

RaiLaxmi: హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో రాయ్‌ల‌క్ష్మీకి సంబంధించిన ప‌లు యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు. అర్థ‌రాత్రి 2గంట‌ల స‌మ‌యంలో షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. అయితే ఆమెపై యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో.. ప్ర‌మాద‌వ‌శాత్తు కింద ప‌డ‌డంతో ఆమె మోకాలికి గాయ‌మైంది.

Railaxmi latest

ఒక్క‌సారిగా ఆమె కింద‌ప‌డ‌డంతో చిత్ర‌బృందం వెంట‌నే ఆమెను పైకి లేపారు. ఈమె కాలికి బ‌లంగా గాయం కావ‌డంతో చిత్ర‌బృందం షూటింగ్ నిలిపివేసింది.. రాయ్‌ల‌క్ష్మీని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.