ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ బెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. ఇటీవల కార్గిల్‌లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్లో ఆయన పాల్గొనగా.. ఈ షూటింగ్ సందర్భంగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ముంబైలోని నానావతి హాస్పిటల్లో రాహుల్ రాయ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మరిత విషమంగా మారిందని, చావుతో పోరాటం చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. . ప్రస్తుతం ‘కార్గిల్‌లో LAC: లివ్ ది బ్యాటిల్ ఇన్ కార్గిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
గత కొద్దిసంవత్సరాల క్రితం బాలీవుడ్‌కి దూరమైన రాహుల్ రాయ్ ఇటీవలే తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. కార్గిల్‌లో జరుగుతున్న షూటింగ్లో అనారోగ్యానికి గురైన ఆయనను సైనిక అధికారుల సాయంతో శ్రీనగర్‌కు హెలికాప్టర్లో తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముంబైలోని నానావతి హాస్పిటల్‌కు తరలించారు.
రాహుల్ రాయ్ అఫాసియా అనే వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల మాటలు తడబడటం, సరిగ్గా మాట్లాడలేకపోవడం లాంటివి జరుగుతున్నాయి. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. త్వరలోనే ఆయనకు సర్జరీ చేస్తామని, బ్రెయిన్లో స్టెంట్ వేసేందుకు ప్రయత్నిస్తామని వైద్యులు చెప్పారు. గత 17 రోజులుగా కార్గిల్‌లో సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మరో రెండు రోజుల్లో షూటింగ్ ముగియనుంది. అక్కడ మైనస్ 15 డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణంలో షూటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో రాహుల్ రాయ్ అనారోగ్యానికి గురి కావడంతో సినిమా యూనిట్ ఆందోళనలో ఉంది.