బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఎప్పుడూ ఏదోక న్యూస్‌తో వార్తల్లో ఉంటాడు. బిగ్‌బాస్-3లో నటి పునర్నవితో రాహుల్ లవ్ ట్రాక్ నడపడంతో.. వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ తామిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అని వారిద్దరు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆషురెడ్డి అనే అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. దీంతో ఆషురెడ్డితో రాహుల్ డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో దీనిపై రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. తన లైఫ్‌లో ప్రేమ కథలు చాలా ఉన్నాయని, తన దృష్టిలో ప్రేమకథ అంటే మనిషిని మనిషి ప్రేమించడమని రాహుల్ చెప్పాడు. వేరే ప్రేమకథలైతే ఏం లేవన్నాడు. మొన్నటివరకు పునర్నవి తన గర్ల్‌ఫ్రెండ్ అన్నారని, ఇప్పుడు అషురెడ్డి అంటున్నారు. ఒక హార్ట్ సింబల్ పెట్టినంత మాత్రాన ఆమె నా లవర్ అయిపోదు. ఆమె నా క్లోజ్ ఫ్రెండ్ అని రాహుల్ చెప్పాడు.
రియల్ రిలేషన్ షిప్ అని పోస్ట్ పెట్టి లవ్ సింబల్ పెట్టా. దానిని చూసి మా ఇద్దరి మధ్య లవ్ ఉందని అనుకున్నారు. కానీ ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అని రాహుల్ వెల్లడించాడు. ఆషుతో డేటింగ్ అని అనలేను. ఆమె నా జాన్ జిగిరీ అంతే.. ఆషు నాకు బిగ్‌బాస్‌కి వచ్చిన తర్వాతే నాకు పరిచయం అని రాహుల్ చెప్పాడు.