KGF హీరో యష్ గురించి అభిమానులకు ఎక్కువగా తెలిసేది ఆయన సతీమణి ద్వారానే. యష్ భార్య రాధిక పండిట్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా కనిపిస్తుంటారు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రాధిక యష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత నటనకు ఎండ్ కార్డ్ పెట్టి ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.
ఇక ఇటీవల రాధిక ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని షేర్ చేసుకుంది. స్నేహితులంటే ఎంత ఇష్టమో ఆమె ఒకే ఒక్క కామెంట్ తో క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పేశారు. తన స్నేహితులతో ఎప్పుడో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఫ్రెండ్స్: వాళ్ళు మన జీవితాల్ని బ్యూటీఫుల్ గా మారుస్తారు.. అని మంచి కొటేషన్ ఇచ్చింది. ఆ ఫొటోలో రాధిక చిరకాల మిత్రులతో పాటు ఆమె భర్త యష్ కూడా ఉన్నాడు. దీంతో నిమిషాల్లోనే ఆ ఫోటో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.