అమెజాన్ లో స్ట్రీమ్ కానున్న ‘రాయన్’

ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన రాయన్ చిత్రం ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి కోసం హీరో ఎలాంటి పోరాటం చేశారు? అనే కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్గా మూవీ తెరకెక్కింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సూపర్ హిట్గా గా నిలిచింది.

అయితే తమిళ సినిమాలు విడుదల అయినా 8 వారాల వరుకు ఓటిటి రాకుండా చేసుకునేలా తమిళ సినీ ఇండస్ట్రీ ప్రకటిస్తూ ఉంది. జులై 26న విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు నెల రోజులు కూడా పూర్తి కాకుండా 4 వారాలకే ఇప్పుడు ఓటిటిలో స్టెమ్మింగ్ కు సిద్ధంగా ఉంది.