“రాయన్” దర్శక వీడియోతో ధనుష్ కు బర్త్ డే విషెస్

ఈరోజు తమిళ స్టార్ హీరో ధనుష్ పుట్టినరోజు శుభాకాంక్షలు రాయన్ సినిమా టీం నుండి ఒక స్పెషల్ వీడియోతో ధనుష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తాను నటిస్తూ వచ్చిన సినిమా రాయన్. ఈ సినిమాలో ధనుష్ తో పాటు సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య తదితరులు కీలకపాత్రలో నటించడం జరిగింది.

జులై 26న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా ధనుష్ దర్శకత్వం చేయడంతో మరింత ప్రేక్షకుల మన్నన పొందింది. ఈరోజు పుట్టినరోజు కావడంతో రాయన్ టీమ్ నుండి వచ్చిన స్పెషల్ వీడియో ఇంటర్నెట్లో బాగా అవుతుంది. ఈ వీడియోలో ధనుష్ దర్శకత్వం చేస్తున్న కొన్ని విజువల్స్ తో పాటు ధనుష్ నటీనటులకు తనకు ఎటువంటి ఔట్ పుట్ కావాలో అలా నటించి చూపిస్తూ ఉన్నారు.