ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం – పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి

R Narayana Murthy

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి స్నేహ చిత్ర పిక్చర్స్‌ బేనర్‌పై నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

పీపుల్స్‌స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ – ”మా సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. విజయనగరం, బొబ్బిలి, ఆలూరు, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రదేశాల్లో షూటింగ్‌ జరిపాం. షూటింగ్‌కి సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు విలువను తెలియజేసే చిత్రం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కథనంతో ఈ చిత్రం చేశాం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ఈ చిత్రంలో చూపించాం. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి సినిమాను మే నెలలో రిలీజ్‌ చేస్తాం. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఆర్‌. నారాయణమూర్తి, ఎల్‌.బి. శ్రీరామ్‌, కాశీ విశ్వనాథ్‌, గౌతంరాజు, కృష్ణనాయక్‌, విక్రమ్‌, నర్సయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఆర్‌. నారాయణమూర్తి, జలదంకి సుధాకర్‌, పాటలు: గద్దర్‌, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, గవిగంటి రాజలింగం, సింగర్‌: వందేమాతరం శ్రీనివాస్‌, నాగూర్‌బాబు, గోరేటి వెంకన్న, విమల, తేలు విజయ, పవన్‌ చరణ్‌ తేజ్‌, కెమెరా: శ్రీనివాస్‌, ఎడిటింగ్‌: రామారావు, నిర్మాణ, నిర్వహణం: రామకృష్ణారావు, కథ, కథనం, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్‌. నారాయణమూర్తి.