క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. 2021లో విడుదల అయిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా ఉండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక చిత్రం ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ:
ఒక రోజువారీ కూలీ నుండి మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి పుష్ప ఎలా ఎదిగాడో పుష్ప పార్ట్ 1 లో చూడడం జరిగింది. పార్ట్ 2లో ఆ సిండికేట్ను పుష్ప ఎలా రూల్ చేస్తాడో ఉండబోతుందన్నట్లు. అయితే పార్ట్ 1లో బనావర్ సింగ్ శకావత్, మంగళం శ్రీను, దాక్ష, జాలి రెడ్డి లాంటివారు పుష్ప ఎదిగే క్రమంలో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. పార్ట్ 2 లో వారు పుష్ప పై పగ తీర్చుకుంటారా లేదా? పుష్పకు వారు ఎటువంటి నష్టం చేస్తారు? పుష్పను తన అన్న పార్ట్ 2లో అయినా దగ్గరకు తీసుకుంటాడా లేదా? పెద్ద మొత్తంలో పుష్ప ఏం చేయబోతున్నాడు? ఈ కథలోకి జగపతిబాబు క్యారెక్టర్ ఎందుకు వస్తుంది? కథలో జగపతిబాబు వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి? జాతర ఎపిసోడ్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటులు నటన:
చిత్రానికి నటన విషయంలో ముందు వరుసలో చెప్పవలసింది అల్లు అర్జున్, ఫహద్ ఫజల్, రష్మిక మందన్న గురించి. అల్లు అర్జున్ తన పూర్తిస్థాయి పర్ఫామెన్స్ ఇస్తూ తన నటనతో ఫేస్ ఆఫ్ సినిమాగా అన్నారు. ఫహద్ ఫజల్ నటన సినిమాకు పెద్ద బోనస్పాండ్గా నిలిచింది. అదేవిధంగా రష్మిక మందన్న క్యారెక్టర్ కేవలం ఒక హీరోయిన్ కి ఇచ్చే ప్రాముఖ్యతల మాత్రమే కాకుండా మొత్తం సినిమా కథకు ముడిపడి ఉంది. పుష్ప పార్ట్ 1తో తన నటనతో జాతీయ అవార్డు సాధించిన అల్లు అర్జున్ పార్ట్ 2లో జాతర ఎపిసోడ్ ఇంకా సెంటిమెంట్ పండించే విషయాలలో అల్లు అర్జున్ ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు తమ క్యారెక్టర్ కు తగ్గట్లు పూర్తిస్థాయి పర్ఫామెన్స్ ఇవ్వడం జరిగింది.
సాంకేతిక విశ్లేషణ:
సుకుమార్ కథ, దర్శకత్వం ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంది. ఇక్కడ కాంప్రమైజ్ కాని నిర్మాణ విలువలతో సుకుమార్ దర్శక విలువలతో ఈ చిత్రం ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకు బోనస్ అని చెప్పుకోవాలి. సినిమాలో సీన్స్ కు తగ్గట్లు అటు యాక్షన్, ఎలివేషన్ తో పాటు సెంటిమెంట్ సీన్స్ కు బిజిఎం అందించడంతో దేవి శ్రీ ప్రసాద్ సక్సెస్ అయ్యారు. సినిమాలోని జాతర సీన్ ఒక్కటి చాలు సినిమాలోని సంకేతిన విలువలు చెప్పేందుకు అన్నంతల ఆ సీన్ ఉంది. సినిమాలోని పాటలు, డ్యాన్స్ చాల బావున్నాయి. ఫైట్స్ అయితే ఊహించిన స్థాయికి మించి ఉన్నాయి. సినిమా కొంచం లెంగ్త్ అయినప్పటికీ కథలో ఇంటెన్సిటీ ఉండటంతో ఎక్కడ బోర్ అనిపించదు. రెండవ భాగంతో పోలిస్తే మొదటి భాగం కొంచం దుల్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కొంచం తెలిపోయినట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్సకత్వం, నటీనటుల నటన, అల్లు అర్జున్, ఫహాద్ ఫజిల్ సినిమాకు నటన బోనస్, సెంటిమెంట్, బిజిమ్, జాతర ఎపిసోడ్, ఫైట్స్, సాంగ్స్, సినిమాటోగ్రఫీ.
నెగటివ్ పాయింట్స్:
క్లైమాక్స్, సినిమా లెంగ్త్.
సారాంశం :
ఒక్క మాటలో చెప్పాలి అంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ జాతరతో తెలుగు సినిమా స్థాయి ఇంకో మెట్టు పెంచుతూ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సినిమా మెప్పించింది. అల్లు అర్జున్ పూర్తి పర్ఫార్మెన్స్ తో ఇండియన్ స్క్రీన్ పై జాతర చేశారు.