‘నడుము’పై క్లారిటీ ఇచ్చిన పూజాహెగ్డే

సౌత్ ఇండియన్ సినిమా వాళ్లంతా నడుము మత్తులో ఉంటారంటూ ఇటీవల ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ పూజాహెగ్డే వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలు వివాదాస్పదంగా మారాయి. మిడ్ డ్రెస్‌లలో హీరోయిన్స్‌ను చూడాలని ఉంటారంటూ ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై వివాదం నెలకొనడంతో తాజాగా క్లారిటీ ఇచ్చింది.

pujahegde

‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో.. కానీ అభిమానాన్ని మార్చలేరు. నాకు ఎప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ ప్రాణసమానం. ఇది నా సినిమాలను అభిమానించేవారికి, నన్ను అభిమానించేవారికి తెలుసు. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా’ అని పూజాహెగ్డే తెలిపింది.

ఫుల్ ఇంటర్వ్యూను చూడాలని సూచించిన పూజాహెగ్డే.. తాను అన్న కొన్ని మాటలను కొంతమంది వక్రీకరించారని చెప్పింది.