Powerstar: నేడు డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ బ‌ర్త్‌డే.. ప‌వ‌న్‌ను క‌లిసిన మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు!

Powerstar: టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. కాగా ఆయ‌న ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాపై దృష్టిపెట్టాడు.. పీఎస్‌పీకే28 చిత్రాన్ని ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో..మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు త‌న‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల‌తో.. ప‌వ‌న్‌ను క‌లిసి ఆయ‌న నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు హ‌రీశ్‌..

Director Harish Shanker

అలాగే అత‌నికి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ… పూల బోకేను అంద‌జేశారు ప‌వ‌న్‌. ఈ నేప‌థ్యంలోనే తాను మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సినిమా చేయ‌బోయే చిత్రం కాబ‌ట్టి ప‌వ‌న్‌తో క‌లిసి ఆ నిర్మాత‌లు ఫోటోలు దిగారు.. ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.