హాస్యం మూవీస్ బ్యానర్ పై సుబ్బు మంగదేవి రచన దర్శకత్వంలో రాజేష్ దండ, బాలాజీ గుట్ట నిర్మాతలుగా అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బచ్చలమల్లి. హరితేజ, రావు రమేష్, సాయి కుమార్, రోహిణి, ధనరాజ్, హర్ష చముడు, అచ్యుత్ కుమార్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా రిచర్డ్ ఎమ్ నాథన్ సినిమాటోగ్రఫీ చేశారు. డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి నిర్మాత రాజేష్ దండ మీడియా వారితో మాట్లాడుతూ ఈ చిత్ర విశేషాలు ఈ విధంగా పంచుకున్నారు.
- సుమారు 3 సంవత్సరాల క్రితం “ఇట్లు మారేడుమల్లి నియోజకవర్గం” షూటింగ్ టైమ్ లో ఈ కథ విన్నాను.
- 1980-90లలో జరిగిన బచ్చల మల్లి అని ఒక వ్యక్తి కథ తీసుకుని, ఆ కథకు మరికొన్ని ఊహాత్మక రచనను కలిపి ఈ సినిమా చేయడం జరిగింది.
- ఈ సినిమా కథ విన్నాక నరేష్ చాల ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు. మరొక కొత్త రకమైన సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు.
- ఈ సినిమా రామ్ చరణ్ కు ‘రంగస్థలం’ ఎలా తన కెరియర్లో నిలిచిపోయిందో అలాగే నరేష్ కు ‘బచ్చలపల్లి’ సినిమా నిలిచిపోతుంది.
- మా నిర్మాణ సంస్థలో ఒక పాన్ ఇండియా కథ ఫిక్స్ అయింది. ఆ సినిమాకు సంబంధించి తదుపరి విశేషాలు దసరా తరువాత అనౌన్స్ చేస్తాం.
- ఈ సినిమాలో బచ్చలమల్లి అనే ఒక క్యారెక్టర్ సరిదిద్దుకోలేని తప్పులు చేసిన తరువాత బాధపడతాడు. అటువంటి సరిదిద్దుకోలేని తప్పులను చేసిన తర్వాత దాని వలన జరిగిన నష్టం ఏంటి, ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు అనే విషయంపై ఈ సినిమా. సినిమాలో మంచి ఎమోషన్ ఉండబోతుంది.
- నేను సాధారణంగా వేరు వేరు జొనర్స్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. సినిమా ఫస్ట్ హాఫ్ నన్ను ఎగ్జైట్ చేస్తేనే సెకండ్ హాఫ్ వింటాను.
- బచ్చలమల్లి సినిమాలో సంగీతం హైలైట్ గా నిలుస్తుంది. అదేవిధంగా ఇది చిన్న మెసేజ్ తో లవ్ స్టోరీ, డ్రామా ఉన్న సినిమా. సినిమా RR కోసం 2 నెలలు టైం తీసుకున్నాం.
- నేను ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్స్ లో బచ్చలపల్లి సినిమా డైరెక్టర్ సుబ్బు బెస్ట్ అనిపించారు.
- ఆర్ట్ డైరెక్టర్ పూర్తిగా తన కష్టం పెట్టారు. నరేష్ గారి ఫైట్స్, జాతర హై లైట్. ఈ సినిమాలో 4 పాటలు నలుగురు రైటర్స్ రావడం జరిగింది.
- అమృత అయ్యర్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్. హనుమాన్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా చేసిన ఒక హీరోయిన్ ఈ సినిమాకి ఒప్పుకుంది అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎలా ఉండబోతుందనేది.
- నరేష్ తో మరోసారి ఎంటర్టైనింగ్ రోల్ లో ఫ్యామిలీ టైప్ ఒక సినిమా అనుకుంటున్న. కచ్చితంగా భవిష్యత్తులో అటువంటి సినిమాని చేయడానికి ప్రయత్నిస్తాను.
- బచ్చలమల్లి సినిమా సుమారు అంతా ఒరిజినల్ లొకేషన్ లో తీశాం. కొన్ని మాత్రమే సెట్స్ వేసి తీయడం జరిగింది.
- ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ తక్కువసేపు ఉన్నప్పటికీ మంచి ఇంపాక్ట్ ఉంటుంది.
- కిరణ్ అబ్బవరం తో ఫిబ్రవరిలో మొదలవుతుంది. రోమ్ కామ్ సినిమా. వచ్చే సంవత్సరం 2 సినిమాలు కచ్చితంగా ఉండబోతున్నాయి. నాకు కమర్షియల్ సినిమాలు చేయడం అంటే ఇష్టం.
- మజాకా సినిమా శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా థియేటర్లతో సమస్యలు రాకుండా ఉండడానికి శివరాత్రికి రావడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నాము.
- సాటిలైట్ & డిజిటల్ వ్యాపారం మజాకా & బచ్చలమల్లి రెండు సినిమాలకు పూర్తిపోయాయి. నా నిర్మాణంలో రాఘవ లారెన్స్ తో సినిమా ఏం లేదు.