సినిమాను సినిమా లాగా మాత్రమే చూడాలి. అన్ని చట్టాలకు లోబడే చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఎవ్వరి మనోభావాలను కించపరచే విధంగా సినిమాను తీయలేదు. దిశ బయోపిక్ మేము తీయడం లేదు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మళ్ళీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దిశ తల్లిదండ్రులను ఎవ్వరిని సంప్రదించలేదు. నవంబర్ 26న దిశ ఎన్ కౌంటర్ చిత్రం రీలీజ్ చేస్తున్నాం. కోర్టు ఎలా తీర్పు ఇస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటాము. సెన్సార్ బోర్డ్ ఇంకా మాకు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు. దిశ కమిషన్ కు సంబంధించిన విషయాలు చిత్రంలో ఏమి చెప్పలేదు. నిజం నిర్భయంగా ఈ చిత్రంలో చూపించాము. చిత్రం మొత్తం ఒక గంట 50 నిముషాలు ఉంటుంది. పోకిరీలు పెట్టె కామెంట్స్ పై తాము ఏమి స్పందించలేము. పోలీసులు సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలి. వర్మ వచ్చిన తర్వాత ఈ దిశ చిత్రంపై పూర్తి వివరాలు వెల్లడిస్తారు.
ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా అనురాగ్ కంచెర్ల, సమర్పకులుగా కరుణ నట్టి క్రాంతి వ్యవహరిస్తున్నారు. వారు షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల నట్టి బ్రదర్స్‌లో వస్తున్న సినిమా కాబట్టి నా భాద్యతగా ఈ విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వివరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు నిర్మాత నట్టి కుమార్.
చంటి అడ్డాలపై ఫైర్ అయిన నిర్మాత నట్టికుమార్.
నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌత్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రాన్ని టైటిల్ మార్చి విడుదల చేయనున్నట్లు నిర్మాత చంటి అడ్డాల తెలిపిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ –
ఐనా ఇష్టం నువ్వు సినిమాని చంటి అడ్డాల మాకు అమ్మినట్టు సాక్ష్యాలున్నాయి. అయినా ఎక్కువ డబ్బు కోసం ఆయన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ విషయమై మేము కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా సినిమా విడుదలపై స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో కొంత మంది పోలీసుల నుండి మాకు బెదిరింపులు వస్తున్నాయి. మరోసారి ఇలా జరిగిన యెడల వారిపై కూడా చట్టరిత్యా కేసు పెట్టడం జరుగుతుంది అని తెలిపారు.