‘భారతమెరికా’ పుస్తకం ఓ అద్భుతమైన ప్రయత్నం..!!

12వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన పరిణామ క్రమాన్ని భారతమెరికా పుస్తకం లో భగీరథ అద్భుతంగా రచించారు .
నిజంగా ఇది భగీరథ ప్రయత్నమే అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె .వి . రమణాచారి పేర్కొన్నారు .
భగీరథ రచించిన భారతమెరికా పుస్తకాన్నిశనివారం రోజు 7వ ప్రపంచ తెలుగు సదస్సులో రమణాచారి ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ

ఈరోజుకు ఎంతో ప్రత్యేకత వుంది , మళ్ళీ ఈనాటి రోజును మనం చూడలేము ,ఈరోజున ఈ పుస్తకం ఆవిష్కరించడం భాగీరధ అదృష్టం . .. భగీరథ నాకు 30 సంవత్సరాలుగా తెలుసు , స్నేహశీలి , సహనశీలి అయిన భగీరథ చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది . సాహిత్యం , చరిత్ర అంటే భగీరధకు ఎంత ఇష్టమో ,ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది . 40 ఏళ్ళక్రితం భగీరధ రాసిన మానవత పుస్తకానికి మహాకవి శ్రీశ్రీ ముందు మాట వ్రాసి ఆశీర్వదించారు . అదే భగీరధ సాహిత్య జీవితానికి పునాది వేసి స్ఫూర్తిని కలిగించిందని రమణాచారి చెప్పారు. భగీరథ రచించిన అక్షరాంజలి పుస్తకాన్ని నాకు అంకితం ఇచ్చాడు .. ఆ స్మృతులు నాకు గుర్తున్నాయి అని రమణాచారి చెప్పారు .


ప్రత్యేక అతిధి గా వచ్చిన దర్శకుడు ఎస్ . వి కృషారెడ్డి మాట్లాడుతూ .

భారతమెరికా ఓ అద్భుతమైన ప్రయత్నం . ఈ పుస్తకం చదివిన తరువాత భగీరథ గారిలో ఇంత జ్ఙాన సంపద ఉందా అని ఆశర్యపోయాను . 12వ శతాబ్దము నుంచి మన చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించారు అని చెప్పారు
భారతమెరికా చదవడం మొదలు పెడితే ఎక్కడా ఆపాలనిపించదు . చక్కటి భాష ,ఆసక్తి కలిగించే శైలి అమోఘంగా వుంది. నాకు మనస్ఫూర్తిగా నచ్చిన పుస్తకం భారతమెరికా అని చెప్పారు కృష్ణారెడ్డి .

నిర్మాత అచ్చి రెడ్డి మాట్లాడుతూ .

భగీరధ గారు మాకు 30 సంవత్సరాలుగా తెలుసు . మా ఇద్దరికీ ఎంతో ఆత్మీయుడు , భారతమెరికా టైటిల్ చాలా ఆసక్తిని కలిగిస్తుంది . మధ్య యుగాలనాటి మన చరిత్రను తన అమెరికా పర్యటనతో కలిపి రాయడం నన్ను ఎంతో ఆకట్టుకుంది అని చెప్పారు ప్రతి ప్రవాస భారతీయుడు చదవాల్చిన అపురూప గ్రంధం భారతమెరికా అని అచ్చి రెడ్డి చెప్పారు .
రచయిత భగీరథ మాట్లాడుతూ . సాంస్కృతిక వారసత్వం అన్నది ఒక తరం నుంచి మరో తరానికి అందించాలని , అలా జరగకపోతే జాతి నిర్వీర్యమై పోతుందనే సందేశం ఇచ్చే పుస్తకమే భారతమెరికా అని చెప్పారు . భారతమెరికా గ్రంధాన్ని డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజుకు అంకితం ఇచ్చారు