‘తండేల్’ చిత్రం గురించి నాగార్జున ఏం అన్నారంటే… : నిర్మాత బన్నీవాసు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు నిర్మాత బన్నీవాసు విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాల్ని పంచుకున్నారు.

‘తండేల్’ ఎలా స్టార్ట్ అయ్యింది ?
-నా క్లాస్ మేట్ భాను. తను కో ప్రొడ్యూసర్ గా కూడా చేస్తాడు. రైటర్ కార్తిక్ దగ్గర ఈ కథ విని బావుందని నా దగ్గరికి తీసుకొచ్చాడు. కార్తిక్ చెప్పిన కథలో ఎసెన్స్ నాకు చాలా నచ్చింది. తనది కూడా మత్సలేశ్యం ఊరు పక్కనే.  అక్కడ స్ఫూర్తి పొంది కథని రాసుకున్నాడు. పాయింట్ నాకు చాలా నచ్చింది. కార్తికేయ 2 తర్వాత చందు గారికి ఈ కథ వినమన్నాను. తనకీ చాలా నచ్చింది. అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. చాలా రీసెర్చ్ చేశాం.ఈ కథ కోసం కొందరి కలిసినప్పుడు వారు చెప్పిన కొన్ని విషయాలు గూస్ బంప్స్ తీసుకొచ్చాయి. ఈ విషయాలన్నీ చెప్పడానికి రాజు సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని డైరెక్టర్ చందు డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్స్ ద్వార జరిగిన కథ చెప్పాం.

-ఇది ప్యూర్ లవ్ స్టొరీ. రాజు సత్య ప్రేమ కథ చాలా కీలకం. ఆ లవ్ స్టొరీ ద్వారా ఒరిజినల్ గా జరిగిన స్టొరీని చూపించుకుంటూ వచ్చాం. ఇది యాభై శాతం ఫిక్షన్. యాభై శాతం నాన్ ఫిక్షన్. డైరెక్టర్ గారి విజన్ ని వందశాతం ఫాలో అయ్యాం.

 తండేల్ టైటిల్ జస్టిఫీకేషన్ ఏమిటి ?
– మత్సలేశ్యం అనే ఊరుని భేస్ చేసుకుని తీసుకున్న కథ ఇది. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్ కి ఫిషింగ్ కి వెళ్తారు. అక్కడ బొట్లు వున్న వారికి బిరుదులు వుంటాయి. మెయిన్ లీడర్ ని తండేల్ అంటారు. ఇది గుజరాతీ వర్డ్.  

తండేల్ అవుట్ పుట్ చూసి నాగార్జున గారి రెస్పాన్స్ ఏమిటి ?
– రీసెంట్ గా ఆయన్ని నేను కలవలేదు. అయితే కంటెంట్ ఆయన కి బాగా నచ్చిందని  చైతన్య గారు చెప్పారు.  

చైతు గారికి ఈ కథ ఎప్పుడు చెప్పారు?
-నాలుగేళ్ల క్రితం ఓ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఈ మధ్య విన్న మంచి కథ ఏమిటని అడిగారు. అప్పుడు ఈ కథ గురించి చెప్పాను. ఆయనకి పాయింట్ చాలా నచ్చింది. భలే వుంది మనం చేస్తున్నామని అన్నారు. అయితే ఇందులో ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్, సముద్రంలోకి వెళ్లిన తర్వాత నెలల పాటు స్నానం వుండదు, అంతా ఒరిజినల్ లా షూట్ చేయాలని అనుకుంటున్నాం.. యాస కూడా వుంటుందని చెప్పాను. ‘నేను వర్క్  చేస్తా’నని చెప్పారు. ఆయన ఈ పాత్ర కోసం మౌల్డ్ అయిన విధానం అద్భుతం. ఆడియన్స్ అందరికీ ఫెబ్రవరి 7న  చైతు గారు సర్ ప్రైజ్ ఇస్తారు. చివరి అరగంట కుమ్మేశారు.

-సాయి పల్లవి సినిమా చూసి ‘నేను మామూలుగా చేసుకుంటూ వెళ్లాను. చైతు గారు నాకు గట్టి కాంపిటేషన్ ఇస్తున్నారు’అని చెప్పి తనకి మ్యాచ్ అయ్యేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శివుని పాటలో సాయి పల్లవి చైతు డ్యాన్స్ థియేటర్స్ లో పూనకం తెప్పిస్తుంది.  

దేవిశ్రీ మ్యూజిక్ గురించి ?
ఇది రూటెడ్ స్టొరీ. నేచురల్ గా షూట్ చేశాం. అంత నేచురల్ గా మ్యూజిక్ కూడా వుంటుంది. ఇప్పటికే పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఇందులో సిజీ వర్క్ ఉందా ?
-ఇందులో తుపాన్ ఎపిసోడ్ తప్పితే మిగతా సీన్స్ అన్నీ ఒరిజినల్ సముద్రంలోనే షూట్ చేశాం. ప్రతి షాట్ ఒరిజినల్ గా వుంటుంది.  షామ్ దత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

-ఈ సినిమాని కేరళ, మంగళూరు, గోవా, వైజాగ్ ఇలా నెంబర్ అఫ్ లోకేషన్స్ లో షూట్ చేశాం. ఈ సినిమాకి చేసినంత అవుట్ డోర్ ఏ సినిమాకి చేయలేదు. ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా వుంటుంది.

-ఈ కథ చెప్పే విధానం నేచురల్ గా వుండాలి. ప్రతి ఫేస్ కొత్తగా ఫ్రెష్ గా వుండాలి. అందుకే చాలా వరకూ కొత్త ఫేసస్ ని తీసుకున్నాం.  

ట్రైలర్ లో దాదాపుగా కథ చెప్పిన భావన కలిగింది ?
-ట్రైలర్ లో చూసింది తక్కువే. అందరికి తెలియనిది సినిమాలో చాలా వుంది. జైల్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఎదురుకున్నారో ఎవరికీ తెలీదు. సినిమాలో చాలా ఇంట్రస్టింగ్ కంటెంట్ వుంది.    

డైరెక్టర్ చందు గారి గురించి ?
-ప్రేమమ్ లాంటి కల్ట్ సినిమా రీమేక్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ సినిమాని ఆయన ప్రజెంట్ చేసిన తీరుకి సర్ప్రైజ్ అయ్యాను. తనలో సమ్ థింగ్ వుందనిపించింది. సవ్యసాచి తర్వాత ఆయనకి నాకు సింక్ కుదిరింది. లక్కీగా కార్తికేయ2  తర్వాత ఈ కథ దొరకడం ఆయనకి నచ్చడంతో ప్రాజెక్ట్ మౌల్డ్ అయ్యింది.

మీ కంటే అరవింద్ గారు ఎక్కుగా ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు ?

-సినిమా మూడు భాషల్లో రిలీజ్ అవుతుంది. మెయిన్ తెలుగు. హిందీ తమిళ్ డబ్బింగ్. పోస్ట్ ప్రొడక్షన్ లో నేను బిజీగా వున్నాను. చెన్నై ఈవెంట్ కి అందుకోలేకపోయాను. అరవింద్ గారు సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూశారు. చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. మాకు ఇంత లైఫ్ ఇచ్చిన ఆయన ఇంత ఎంజాయ్ చేస్తుంటే మాకూ ముచ్చటగా వుంది.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ