టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత, TFPC వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ కు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి కె వసుంధరా దేవి సోమవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్నారు. నేడు హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే కన్నుమూశారు. తల్లి మరణంతో అశోక్ కుమార్ తీవ్ర మనోవేదనకు లోనయ్యారు.
వసుంధర దేవి సీనియర్ నిర్మాత డి. రామా నాయుడు గారికి సొంత సోదరి. దగ్గుబాటి వారికి అశోల్ కుమార్ కి దగ్గరి బంధువులు. ఇక అశోక్ కుమార్ విలన్ పాత్రలతో అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా చెవిలో పువ్వు, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్ వంటి సినిమాలను నిర్మించారు. ఇక ఆయన తల్లి మరణించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక వసుంధర దేవికి అశోక్ కుమార్ పాటు మాతో కూతురు D.శారదా కూడా ఉన్నారు. ఆమె రామానాయుడు గారి సోదరుడి భార్య కూడా.