పాపం ప్రియా ప్ర‌కాశ్ కింద‌ప‌డిపోయింది.. చెక్ షూటింగ్ వీడియో వైర‌ల్!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం చెక్‌. ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.. అలాగే ఈ చిత్రంలో ఫిట్‌నెస్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. ఇక ఈ చిత్రానికి చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో, భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆనంద్‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్ర షూటింగ్ సంబంధించి ఓ వీడియోను హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పంచుకుంది. ఆ వీడియోలో చెక్ చిత్ర షూటింగ్‌లో భాగంగా..

priyaprakash

ప్రియా ప్రకాశ్‌ వెనుక నుంచి వ‌చ్చి నితిన్‌ను ప‌ట్టుకోబోగా.. స్లిప్ అయి కింద‌ప‌డిపోయింది. కానీ త‌న‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘ‌ట‌న వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది. దీంతో నెటిజ‌న్ల్ ప్రియా బీకేర్‌ఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఆమె చేయ‌డానికి కార‌ణం.. గ‌తంలో మోహ‌న్‌లాల్ హీరోగా తెరకెక్కిన మ‌ల‌యాళం చిత్రం మ‌న‌సంతా కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఈ సినిమా మంచి విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఆ సినిమా చూసే ఈ చెక్ సినిమా క‌థ విన‌కుండానే ఒప్పుకున్నాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్రియా ప్ర‌కాశ్ తెలిపింది.