Tollywood: అక్కినేని హీరోతో ఉప్పెన డైరెక్ట‌ర్..

Tollywood: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్ల్‌గా తెర‌కెక్కిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన బుచ్చిబాబు సానాకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ఆయ‌న భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న‌కు అక్కినేని ఇంట నుంచి పిలుపు వ‌చ్చింది. Tollywoodఅక్కినేని నాగ‌చైత‌న్య‌ను బుచ్చిబాబు డైరెక్ష‌న్‌లో చేయాల‌ని అనుకున్నార‌ట‌.

buchchibabu

దీంతో ఆయ‌న త‌దుప‌రి చిత్రంపై ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే చైతూకి క‌థ చెప్ప‌డం.. ఆయ‌న ఓకే అన‌డం ఇలా జ‌రిగింద‌ని స‌మాచారం. ఈ చిత్రం కూడా ఉప్పెన చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమా రూపుదిద్దుకుంటుంద‌ట‌. అలాగే బుచ్చిబాబు డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోసం క‌థ సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఉప్పెన చిత్రంతో హీరో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాకు Tollywoodటాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.