పవన్ కళ్యాణ్ సినిమాలో క్యూట్ హీరోయిన్.. బంపర్ ఆఫర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో క్యూట్ గర్ల్ ప్రణీత సుభాష్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ కు మెయిన్ హీరోయిన్ గా నటించనుందట. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక పిటియాడిక్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఫైనల్ గా ఇటీవల క్రిష్ మరోసారి చర్చలు జరిపి ప్రణీతను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం చేస్తున్న ప్రణీతకు ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. ఈ సినిమా హిట్టయితే మిగతా స్టార్ హీరోలతో కూడా అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రణీత లక్కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.