ఆండ్రాయిడ్ కట్టప్ప.. తమిళ్ లో కూడా..

2019 లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంచప్పన్ వెర్షన్ 5.25’. రథీష్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సూరజ్, సెలపిన్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో ఇటీవల ఆండ్రాయిడ్ కట్టప్ప అని కూడా ఓటీటీలో విడుదల చేశారు. ఉత్తమ నటుడు, తొలి దర్శకుడు మరియు ఆర్ట్ డైరెక్టర్‌లు కేరళ రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు.

ఈ చిత్రం విజయవంతం అయిన తరువాత, తమిళ్ రీమేక్ హక్కులను స్వాధీనం చేసుకోవడానికి చర్చలు జరిగాయి. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. కె.ఎస్.రవికుమార్‌తో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసిన సబారీ, శరవణన్‌ తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారని సమాచారం. కె.ఎస్.రవికుమార్‌ నిర్మాతగా మాత్రమే ఉంటారట. ఈ చిత్రానికి ముందు కమల్ నటించిన ‘దేనాలి’ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ నిర్మించారు. ఆ తర్వాత ‘ఆండ్రాయిడ్ కుంచప్పన్’ తమిళ రీమేక్‌ను నిర్మించాలని కేఎస్ రవికుమార్ డిసైడ్ అయ్యారు. .