గత సినిమాలని మించే స్థాయిలో ప్రభాస్ బాండ్ మూవీ?

బాహుబలి, సాహూ సినిమాలతో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జాన్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా యూరోప్ లో పూర్తి చేశారు. సాహూ కోసం జాన్ కి గ్యాప్ ఇవ్వడంతో ఇప్పటి వరకూ ఆగిన ఈ సినిమా మళ్లీ మొదలుకాబోతోంది. అది ఎప్పుడు అనేది పర్ఫెక్ట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ తన పుట్టిన రోజున ప్రభాస్ నుంచి అభిమానులకి ఒక సర్ప్రైస్ రానుంది అనే విషయం మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

prabhas surendar reddy

ఇదిలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డితో ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. కమర్షియల్ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి, సైరా సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు. సరైన కథ పడితే తాను కూడా భారీ సినిమాలు చేయగలను అని నిరూపించిన సురేందర్ రెడ్డి, ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోని జేమ్స్ బ్యాండ్ లాంటి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇండియన్ స్పై సినిమాలు చాలానే వచ్చాయి కానీ పాన్ ఇండియా రేంజులో జేమ్స్ బాండ్ స్థాయి సినిమాలు మన దగ్గర రాలేదు. ఈ లోటు తీర్చడానికి ప్రభాస్ అండ్ సురేందర్ రెడ్డి కలిసి రాబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ ఏ మూవీ గురించి తన పుట్టిన రోజున అప్డేట్ ఇస్తాడు అనే విషయం తెలియాలి అంటే అక్టోబర్ 23 వరకూ ఆగాలి.